2023లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన నాటి పరిణామాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించాయి. అన్యాయమైన అరెస్ట్‌ను ఖండించి ఆ రోజే కూటమి ఏర్పాటుకు బలమైన సంకల్పం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
