ఇది డిజిటల్ స్పీడ్.. ఇది నవతరం ట్రెండ్! ఇప్పుడంతా జెన్‌జీ యుగం! ప్రపంచాన్ని తమ వేలిముద్రలతో శాసిస్తున్న తరం ఇది. రాబోయే కొన్నేళ్ల పాటు ఈ దేశ గమనాన్ని, కాల సమయాన్ని డిసైడ్ చేయబోయేది కూడా ఈ యువతరమే. వీరికి అన్యాయాన్ని చూస్తే రగిలిపోయే ఆవేశం ఉంది.. తప్పును నిలదీసే ధైర్యం ఉంది. కానీ, ఈ సరికొత్త తరం ఆలోచనలకు, వారి ఆశయాలకు తగ్గట్టుగా.. సమాజంలో మార్పు కోసం నిలబడటానికి ఒక పర్ఫెక్ట్ వేదిక ఎక్కడ ఉంది? అణగారిన వర్గాల గొంతుకగా మారి, జెన్‌జీ సైన్యానికి దశా-దిశా చూపించడానికే ఒక అజేయ శక్తిగా ఆవిర్భవించింది.. బీసీవై పార్టీ!
వ్యవస్థలో పేరుకుపోయిన కుళ్లును కడిగేయాలన్నా.. ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేయాలన్నా ఒక పదునైన ఆయుధం కావాలి. ఆ ఆయుధమే బీసీవై పార్టీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు, అన్నదాతలు.. అంతెందుకు, అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం న్యాయం జరిగేలా, వారి హక్కులను కాపాడేలా పోరాడటమే ఈ పార్టీ ఏకైక అజెండా. సమాజంలో వెనుకబడిన ప్రతి వర్గానికి అండగా నిలబడి, అన్యాయాన్ని ప్రశ్నించే సత్తా ఒక్క బీసీవై పార్టీకే ఉంది. ఈ సామాజిక సమరంలో జెన్‌జీ యువతను భాగస్వామ్యం చేస్తూ నవభారత నిర్మాణానికి పునాది వేస్తోంది.
బీసీవై పార్టీలో చేరడానికి, లీడర్ కావడానికి గాడ్‌ఫాదర్లు అక్కర్లేదు.. కోట్లాది రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్‌లు అస్సలు అవసరం లేదు. ఇక్కడ కావాల్సింది కేవలం ఒకటే.. సమాజం కోసం పోరాడాలనే కసి! నిలదీయాలనే ఉత్సాహం.. మార్పు తీసుకురావాలనే జీల్! ఇవే బీసీవై పార్టీ ఇచ్చే అసలైన అర్హతలు.
ఆవేశం ఉంది.. నిగ్గదీయాలనే తత్వం ఉంది.. సమాజానికి మంచి చేయాలనే శ్రద్ధ, ఆసక్తి ఉంది.. కానీ మా మాట వినేవారే లేరు అని బాధపడే ప్రతి జెన్‌జీ యువకుడికి, యువతికి బీసీవై పార్టీ ఒక సింహాసనం లాంటి వేదికను అందిస్తోంది.
మీ ఆలోచనలను, మీ నిరసన స్వరాలను ఈ ప్రపంచానికి వినబడేలా చేసే లాండ్‌స్పీకర్ ఈ బీసీవై పార్టీ సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుడుతూ, నవతరం ఆశయాలకు ప్రతిరూపంగా నిలిచిన బీసీవై పార్టీ.. నేటి జెన్‌జీ తరానికి బహిరంగంగా ఆహ్వానం పలుకుతోంది. పదవులు ముఖ్యం కాదు.. ప్రజాక్షేమమే ముఖ్యం అనుకునే ప్రతి యువ హృదయం అడుగులు ఇప్పుడు బీసీవై వైపే పడుతున్నాయి. రండి.. చేయి చేయి కలపండి.. సామాజిక న్యాయ సాధనలో భాగస్వాములు అవ్వండి.







