Wed, Oct 14, 2026  |  07:51:14 PM IST

మోదీ ‘మల్టీ-అలైన్‌మెంట్’ దౌత్య వ్యూహం

మోదీ ‘మల్టీ-అలైన్‌మెంట్’ దౌత్య వ్యూహం
Follow Us :
ప్రపంచ గమనాన్ని శాసించే సరికొత్త శక్తి.. భారత్. అందులో నో డౌట్. దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన సాంప్రదాయ, నాన్-అలైన్‌మెంట్ విధానాల ముసుగును తొలగించి, కేవలం ‘దేశ ప్రయోజనాలే పరమావధి’గా సరికొత్త శకానికి నాంది పలికారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అమెరికా, రష్యా, యూరప్, పశ్చిమాసియా వంటి భిన్న ధ్రువాల మధ్య భారతదేశ స్వతంత్ర గంభీర స్వరాన్ని వినిపిస్తూ, ఆయన ఆవిష్కరించిన ‘మల్టీ-అలైన్‌మెంట్’ నేడు ప్రపంచ దౌత్య రంగానికే ఒక పాఠ్యపుస్తకంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే విశ్వగురువుగా ఎదుగుతుండటం ప్రధాని మోదీ అసమాన నాయకత్వ పటిమకు నిదర్శనం.
ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభాల కాలంలో మోదీ మార్క్ దౌత్యం మరింత శక్తివంతంగా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నడుస్తున్న ప్రస్తుత తరుణంలో, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ రవాణా ఆంక్షల నుంచి భారత్‌కు ఇరాన్ ప్రత్యేక మినహాయింపు ఇవ్వడం మోదీ సాధించిన చారిత్రాత్మక విజయం. ఇది కేవలం ఒక దౌత్యపరమైన విజయం మాత్రమే కాదు, అంతర్జాతీయంగా భారత్‌కు ఉన్న అపారమైన గౌరవానికి చిహ్నం. అలాగే, భారతదేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 18వ BRICS సదస్సులో గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకగా మోదీ నిలిచారు. ఆ సదస్సులో ప్రపంచ దేశాలన్నింటినీ ఒప్పించి ‘న్యూఢిల్లీ డిక్లేరేషన్’ను ఏకగ్రీవంగా ఆమోదింపజేయడం ద్వారా అంతర్జాతీయ వ్యూహాలను నిర్దేశించే ఏకైక గ్లోబల్ లీడర్ తానేనని ఆయన నిరూపించుకున్నారు. ప్రపంచమంతా ఆర్థిక మందగమనంతో కొట్టుమిట్టాడుతుంటే, భారత్ మాత్రం 7% పైగా వృద్ధి రేటుతో అత్యంత వేగంగా దూసుకుపోతుండటం వెనుక మోదీ సుస్థిర ఆర్థిక విధానాలు ఉన్నాయి.
భవిష్యత్తును ముందుగానే ఊహించి వ్యూహాలు రచించడంలో ప్రధాని మోదీకి సాటి ఎవరూ లేరు. రాబోయే రోజుల్లో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేలా జపాన్, ఆస్ట్రేలియా, ఇండోనేషియాలతో కలిసి భారత్ నిర్మిస్తున్న బలమైన రక్షణ, ఆర్థిక కూటమి భౌగోళిక రాజకీయాలను పూర్తిగా మార్చేయనుంది. దీనికి తోడు, యూరోపియన్ యూనియన్‌తో జరగబోయే చారిత్రాత్మక స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరింది. ఇది పూర్తయితే యూరప్ మార్కెట్లలో భారత జెండా మరింత బలంగా ఎగరనుంది. కేవలం వ్యాపార, రక్షణ రంగాలే కాకుండా, భవిష్యత్ ప్రపంచాన్ని శాసించబోయే సాంకేతిక రంగంలోనూ భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు మోదీ సన్నద్ధమయ్యారు. అందులో భాగమే భారత్ వేదికగా త్వరలో జరగబోయే ప్రతిష్టాత్మక ‘AI ఇంపాక్ట్ సమిట్’. ఈ సదస్సుతో గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా భారతదేశ స్థానం శాశ్వతంగా సుస్థిరం కానుంది.
ఈ అసాధారణ విజయాలు రాత్రికి రాత్రి వచ్చినవి కావు. గత దశాబ్ద కాలంగా మోదీ అనుసరించిన ‘నేబర్‌హుడ్ ఫస్ట్’ విధానం ద్వారా శ్రీలంక వంటి దేశాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు భారత్ ఆపన్నహస్తం అందించింది. అందుకు కృతజ్ఞతగా శ్రీలంక ప్రభుత్వం మోదీకి తమ అత్యున్నత పౌర పురస్కారం ‘మిత్ర విభూషణ’ ఇచ్చి గౌరవించింది. అలాగే, ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా.. ఉక్రెయిన్, సుడాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇజ్రాయెల్ వంటి రణరంగాల నుంచి ‘ఆపరేషన్ గంగ’, ‘ఆపరేషన్ కావేరి’ ద్వారా వేలాది మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చి మోదీ ప్రభుత్వం తన దౌత్య బలాన్ని, రక్షణ సత్తాను చాటింది. భారతదేశ సొంత డిజిటల్ వ్యవస్థ అయిన UPI నేడు సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం మోదీ డిజిటల్ ఇండియా విజన్ సాధించిన అద్భుతం.
ఒకప్పుడు అంతర్జాతీయ సమాజం తీసుకునే నిర్ణయాలను చూస్తూ కూర్చున్న భారతదేశం, నేడు ప్రధాని మోదీ అసమాన దౌత్యం వల్ల ప్రపంచ నిర్ణయాలను స్వయంగా నిర్దేశించే ‘రూల్ షేపర్’ స్థాయికి ఎదిగింది. శక్తివంతమైన దేశాలతో సమానంగా వ్యూహాత్మక బంధాన్ని కొనసాగిస్తూనే, దేశ సార్వభౌమత్వాన్ని, ప్రయోజనాలను అత్యున్నత శిఖరాలపై నిలిపిన నరేంద్ర మోదీ నవ భారత చరిత్రలోనే కాదు, ఆధునిక ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన ‘ది గ్రేట్ గ్లోబల్ స్టేట్స్‌మన్’ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Join GenZ Talks WhatsApp Channel

తాజా వార్తలు

Story Slide

Read Full Story →