దేశ రాజకీయాల్లో ఈ ఒక్క ప్రశ్న ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అధికారిక షెడ్యూల్ ప్రకటించకుండా అత్యంత రహస్యంగా వియత్నాంలో జరుపుతున్న 4 రోజుల పర్యటన కేవలం వ్యక్తిగతం మాత్రమేనా? లేక కేంద్ర ప్రభుత్వంపై దాడికి విపక్షాలు సిద్ధం చేస్తున్న సరికొత్త వ్యూహాత్మక అస్త్రమా? అనే అనుమానాలు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి.
ఇటు రాహుల్ గాంధీ వియత్నాం విమానం ఎక్కడం, అటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నవంబర్ 1న ఢిల్లీలో భారీ నిరసన ర్యాలీని ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నియామకం, ఎన్నికల వ్యవస్థ తీరుపై ఇప్పటికే ‘ఇండియా’ కూటమి భగ్గుమంటోంది. సరిగ్గా ఈ ఆందోళనల నడిమధ్యలో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లడం వెనుక తీవ్రమైన పొలిటికల్ అజెండా దాగి ఉందనేది స్పష్టమవుతోంది.
ఈ ఉత్కంఠను మరింత పెంచుతూ శివసేన UBT కీలక నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దావానలంలా మారాయి. “రాహుల్ గాంధీ ఇండియాకు తిరిగి రాగానే దేశంలో సంచలన మార్పులు వస్తాయి.. కేంద్రంలో అధికార మార్పిడి ఖాయం” అంటూ ఆయన వేసిన పొలిటికల్ బాంబ్ ఇప్పుడు అధికార పక్షాన్ని సైతం ఆలోచనలో పడేసింది.
కాంగ్రెస్ పార్టీ ఈ పర్యటన వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచుతోంది? వియత్నాం వేదికగా దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష కూటమి ఎలాంటి వ్యూహాలకు పదును పెడుతోంది? నవంబర్ 1న జరగబోయే విపక్షాల ర్యాలీ ద్వారా దేశ రాజకీయ చిత్రపటం మారబోతోందా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
కేవలం ఇది సాధారణ విదేశీ పర్యటనా.. లేక ఢిల్లీ గద్దెను కదిలించడానికి తెరవెనుక జరుగుతున్న అసలైన పొలిటికల్ ఆపరేషనా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలాల్సి ఉంది! విపక్షాల ఈ దూకుడుకు అధికార కూటమి ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలి.







