Wed, Oct 14, 2026  |  07:51:14 PM IST

యోగి మార్క్ ‘బుల్డోజర్’ నిర్ణయం

యోగి మార్క్ ‘బుల్డోజర్’ నిర్ణయం
Follow Us :
ఉత్తరప్రదేశ్‌లో అరాచక శక్తులకు, హింసాత్మక నిరసనకారులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, “హింసాత్మక మార్గాల ద్వారా వ్యవస్థను మార్చాలని”  చూసే దేశద్రోహ శక్తులకు ఇకపై యూపీలో ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఉద్యోగాలు దక్కవు. ఈ మేరకు క్యారెక్టర్ వెరిఫికేషన్ నిబంధనలను అత్యంత కఠినతరం చేస్తూ యోగి ప్రభుత్వం సరికొత్త జీవోను జారీ చేసింది.
“ప్రభుత్వ ఉద్యోగం అనేది ప్రజలకు సేవ చేయడానికి, దేశాన్ని నిర్మించడానికి… అంతే తప్ప వ్యవస్థను తగులబెట్టే దేశద్రోహులకు జీతాలు తినిపించడానికి కాదు” అనే గట్టి సందేశాన్ని ఈ నిర్ణయం ద్వారా యోగి ఆదిత్యనాథ్ పంపారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది, కేవలం రాజకీయ సిద్ధాంతాల వల్లో లేదా చిన్నపాటి ఎఫ్‌ఐఆర్ వల్లో ఎవరికీ ఉద్యోగం దూరం కాదు. కానీ, నిరసనల పేరుతో వీధుల్లోకి వచ్చి, విద్రోహ చర్యలకు పాల్పడి, దేశంలో అరాచకం సృష్టించాలని చూస్తే మాత్రం వారి భవిష్యత్తును అంధకారం చేయడానికి ప్రభుత్వం వెనకాడదు. 
నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నాయంటే.. 21 ఏళ్లు దాటిన తర్వాత ఎవరైనా వ్యవస్థకు వ్యతిరేకంగా హింసాత్మక చర్యల్లో పాల్గొని ఉంటే, క్యారెక్టర్ వెరిఫికేషన్ తేదీకి ముందు మూడేళ్ల వరకు వారిపై నిఘా ఉంటుంది. వారు మారారని నిరూపించుకుంటే తప్ప ఉద్యోగానికి అనర్హులు. హత్యలు, అల్లర్లు, దేశద్రోహం, అత్యాచారాలు, పేపర్ లీకేజీలు, సైబర్ మోసాలకు పాల్పడే క్రిమినల్స్ జీవితంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించలేరు. ఈ కఠిన నిబంధనలు కేవలం ప్రభుత్వ శాఖలకే పరిమితం కాదు; కార్పొరేషన్లు, బోర్డులు, విద్యాసంస్థలు, స్థానిక సంస్థల ప్రత్యక్ష నియామకాలకు కూడా వర్తిస్తాయి.
ఈ నిర్ణయంతో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఇది బ్రిటిష్ కాలం నాటి నిరంకుశ చట్టమంటూ గగ్గోలు పెడుతున్నాయి. కానీ, యోగి సర్కార్ మాత్రం అంగుళం కూడా వెనక్కి తగ్గడం లేదు. “శాంతిభద్రతలతో ఆడుకుంటే బుల్డోజర్లు నడుస్తాయి, కెరీర్‌లు నాశనమవుతాయి” అని గతంలోనే నిరూపించిన యోగి, ఇప్పుడు చట్టబద్ధంగా విద్రోహ శక్తుల వెన్నుముక విరిచారు. వ్యవస్థను కాపాడే చేతులకే కలం అందుతుంది.. వ్యవస్థను తగులబెట్టే చేతులకు బేడీలు, నిరుద్యోగమే మిగులుతాయి అని ఈ స్ట్రాంగ్ యాక్షన్ ద్వారా ఉత్తరప్రదేశ్ స్పష్టం చేసింది.
Join GenZ Talks WhatsApp Channel

తాజా వార్తలు

Story Slide

Read Full Story →