ఏం చెప్పావ్‌రా’ అనే డైలాగ్ వినిపిస్తుంది మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రిలీజ్ చేసిన వీడియో చూస్తుంటే. అరె.. భలే చెప్పారే. నిజంగానే అది నిజం కదా అనిపించేలా ఉంది ఆ వీడియో. ఏదేమైనా.. ఏపీ పాలిటిక్స్‌లో ఓ సరికొత్త డ్రామా అన్‌లాక్ అయిందిప్పుడు. విజయసాయి రెడ్డి రిలీజ్ చేసిన వీడియో.. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే ఆయన మాట్లాడిన పాయింట్లు చాలా లాజికల్‌గా ఉన్నాయ్.
గవర్నమెంట్స్ ఇచ్చే జీవోల భాష గురించి.. గతంలో ఎవరూ టచ్ చేయని ఓ యాంగిల్ బయటకు తీశారు. “ఈ ప్రభుత్వాలు రిలీజ్ చేసే జీవోలు ఎవరి కోసం?” అంటూ ఆయన గట్టిగానే క్వశ్చన్ చేశారు. ఒక సాధారణ పౌరుడు ప్రభుత్వ వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఏదైనా జీవో చదవాలి అనుకుంటే… అది చదివి అర్థం చేసుకోవడానికి ఒక పెద్ద డిక్షనరీ లేదా లా డిగ్రీ ఉండాలేమో అన్నంత దారుణంగా ఉంటోంది ప్రస్తుత పరిస్థితి. జీవోలలో వాడే పదాలు, వాక్యాల నిర్మాణం ఎంత క్లిష్టంగా ఉంటుందంటే, అవి రాసే అధికారులకు, చదివే ఉన్నతాధికారులకు తప్ప కామన్ మ్యాన్‌కి అస్సలు మైండ్‌లోకి ఎక్కడం లేదు. ప్రభుత్వాలు ఉండేదే ప్రజల కోసం అయినప్పుడు, ఆ రూల్స్ ఏదో సీక్రెట్ కోడ్ లాగా రాస్తే సామాన్యుడు ఎలా డీకోడ్ చేసుకోవాలి? అందుకే, ఈ ‘ఆఫీసర్-ఓన్లీ’ లాంగ్వేజ్ పద్ధతి మారి, ప్రతి ఒక్కరికీ ఈజీగా అర్థమయ్యేలా రూల్స్ ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వ నిబంధనలు ఎప్పుడైనా క్రిస్టల్ క్లియర్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా, ప్రతి ఒక్కరికీ ఈజీగా అర్థమయ్యేలా సింపుల్ తెలుగు లేదా ఇంగ్లీషులో ఉండాలి. ప్రజలకు అర్థం కాని రూల్స్ వల్ల ఎవరికీ ఉపయోగం లేదనేది ఆయన లేవనెత్తిన మెయిన్ పంచ్. అంతేకాదు.. అందులో సిటిజన్ చార్టర్ అనేది కూడా ఉండాలంటున్నారు. అంటే.. అసలు ఈ జీవో తీసుకొచ్చింది ఎందుకు? ఎవరి కోసం? అందులో ఏముంది? ఎవరికి ఉపయోగం.. ఈ వివరాలన్నీ సవివరంగా ఇవ్వాలంటున్నారు విజయసాయిరెడ్డి.
పరిపాలన అనేది ప్రజలకు దగ్గరగా ఉండాలి కానీ, ఇలాంటి కన్ఫ్యూజింగ్ జీవోలతో సామాన్యుల బుర్రలు పాడు చేయకూడదనే ఈ పాయింట్ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్‌లోనే కాకుండా పబ్లిక్‌లోనూ తెగ ట్రెండ్ అవుతోంది!







