Wed, Oct 14, 2026  |  07:51:14 PM IST

గ్లోబల్ క్లైమేట్ కొల్లాప్స్ – భూమి అంతానికి కౌంట్‌డౌన్ షురూ అయిందా?

గ్లోబల్ క్లైమేట్ కొల్లాప్స్ – భూమి అంతానికి కౌంట్‌డౌన్ షురూ అయిందా?
Follow Us :
ఇది చదువుతున్నప్పుడు మీరు పీల్చే శ్వాస.. రేపు మీకు దొరకకపోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులు ఇప్పుడు కేవలం హెచ్చరికలు కావు, భూమిపై మానవజాతి అంతానికి రాసి పెట్టిన మరణశాసనాలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం-UNEP.. 2026 నివేదికల్లో చెప్పిన భయంకరమైన నిజాలు వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మనం లగ్జరీ లైఫ్ కోసం ఆశపడి, ప్రకృతిని నరికి ముక్కలు చేస్తుంటే… ఇప్పుడు ఆ ప్రకృతే మనల్ని సజీవ సమాధి చేయడానికి సిద్ధమైంది.
టర్కీలో జరగబోయే COP31 క్లైమేట్ సదస్సు ముంగిట పర్యావరణ శాస్త్రవేత్తలు జారీ చేసిన అత్యంత భయంకరమైన ముప్పుల విశ్లేషణ ఏంటంటే.. భూమి సగటు ఉష్ణోగ్రత పారిశ్రామిక విప్లవం కంటే 1.5°C కంటే ఎక్కువ పెరగకూడదని ప్రపంచ దేశాలు గతంలో గీసుకున్న ‘లక్ష్మణ రేఖ’ ఇప్పుడు దాటిపోయింది. భూగోళం ఉడికిపోతోంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 2026 నాటికి ఉద్గారాల వేగం ఇలాగే ఉంటే, ఈ శతాబ్దం మధ్య నాటికి ఉష్ణోగ్రతలు 1.8°C వరకు పెరిగిపోతాయి.
దీని అర్థం ఏంటో తెలుసా? ఆర్కిటికా, అంటార్కిటికా మంచు పర్వతాలు పూర్తిగా కరిగిపోతాయి. సముద్ర మట్టాలు ఉప్పొంగి, ముంబై, న్యూయార్క్, లండన్ వంటి తీర ప్రాంత నగరాలు మ్యాప్ లోంచి శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోతాయి.
మీరు నివసిస్తున్న మెట్రో సిటీలలో స్వచ్ఛమైన గాలి అనేది ఇక ఒక కల మాత్రమే. ఇండస్ట్రియల్ వేస్ట్, కార్బన్ ఉద్గారాల వల్ల గాలి మొత్తం ‘సైలెంట్ కిల్లర్’ కెమికల్స్ తో నిండిపోయింది. WHO నివేదిక ప్రకారం, కాలుష్య వాయువుల వల్ల కోట్ల మంది ప్రజల ఊపిరితిత్తులు కుళ్లిపోతున్నాయి. గుండెపోట్లు, క్యాన్సర్లు మహమ్మారిలా విజృంభిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పుట్టబోయే పిల్లలు ఆక్సిజన్ సిలిండర్లతోనే పుట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
సాంకేతికత పెరిగితే సంతోషించాం… కానీ అదే మన పాలిట శాపంగా మారుతోంది. నేడు ప్రపంచాన్ని శాసిస్తున్న AI డేటా సెంటర్ల నిర్వహణ కోసం ఊహించని స్థాయిలో విద్యుత్, నీరు ఖర్చవుతున్నాయి. ఈ డేటా సెంటర్లను చల్లబరచడానికి మిలియన్ల గ్యాలన్ల నీటిని, వాటి పవర్ కోసం బొగ్గును విపరీతంగా తగలేస్తున్నారు. మనం ఫోన్‌లో చేసే ప్రతి క్లిక్.. భూమిని మరింత వేడి చేస్తూ, వినాశనానికి దగ్గర చేస్తోంది.
ఇప్పుడు మనం చూస్తున్నది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. వేసవి కాలంలో ఎండలు కావు… నిప్పుల వర్షం కురుస్తుంది. వేడిగాలుల ధాటికి మనుషులు రోడ్లపైనే మాడిపోయే రోజులు దగ్గరపడ్డాయి. చలికాలంలో మంచు కాదు… మహా ప్రళయ వరదలు వస్తాయి. తాగడానికి చుక్క నీరు దొరక్క, భూమి ఎండిపోయి బీడువారడం వల్ల ప్రపంచవ్యాప్త కరువు రాబోతోంది. ఆహార సంక్షోభం వచ్చి మనుషులు ఒకరినొకరు చంపుకునే భయానక వాతావరణం సృష్టించబడుతోంది.
ఇది క్లైమేట్ చేంజ్ కాదు, క్లైమేట్ కొల్లాప్స్. కార్పొరేట్ కంపెనీల స్వార్థం, పాలకుల నిర్లక్ష్యం, మన విలాసవంతమైన అలవాట్లు కలిసి భూమికి గోరీ కడుతున్నాయి. ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తున్నట్టు రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే ఉద్గారాలను కనీసం 18 శాతం తగ్గించకపోతే… ఈ భూమిపై మానవజాతి అంతరించిపోయిన డైనోసార్ల జాబితాలో చేరడం ఖాయం!
Join GenZ Talks WhatsApp Channel

తాజా వార్తలు

Story Slide

Read Full Story →