Wed, Oct 14, 2026  |  07:51:14 PM IST

విశ్వసనీయతకు మోదీ రక్ష… విపక్షాల వైఫల్యానికి రాహులే సాక్ష్యం!

విశ్వసనీయతకు మోదీ రక్ష… విపక్షాల వైఫల్యానికి రాహులే సాక్ష్యం!
Follow Us :

గత పుష్కర కాలంగా అప్రతిహతంగా సాగుతున్న నరేంద్ర మోదీ పాలన నవభారతాన్ని ప్రపంచపటంపై అజేయ శక్తిగా నిలబెట్టింది. ప్రపంచం మొత్తం యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, అశాంతితో తగలబడుతుంటే… భారతదేశం మాత్రం ప్రశాంతతతో, తిరుగులేని ప్రగతితో వెలిగిపోతోంది. ఈ ఘనత ముమ్మాటికీ ప్రధాని మోదీ ధృఢ సంకల్పానిదే. కానీ, దేశాన్ని కాపాడుతున్న ఈ సుపరిపాలన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కళ్లకు కనిపించకపోవడం శోచనీయం, దారుణం.

నేడు ప్రపంచ పటాన్ని చూస్తే అగ్రరాజ్యాలు సైతం అతలాకుతలం అవుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ఇటు ఆర్థికంగా ట్రంప్ టారిఫ్‌లు, అంతర్జాతీయ సప్లై చైన్ సంక్షోభాల వల్ల ధనిక దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా కుదేలవుతున్నాయి. యూరప్ మొత్తం నిరసనలతో, ద్రవ్యోల్బణంతో అశాంతి నిలయంగా మారింది. కానీ, ఇంతటి భయానక అంతర్జాతీయ పరిస్థితుల్లోనూ భారతీయులకు ఏ కష్టం రాకుండా, ఇంధన కొరత లేకుండా, ఆర్థిక మాంద్యం తాకకుండా ప్రధాని మోదీ ఒక రక్షక కవచంలా దేశాన్ని కాపాడుతున్నారు. ప్రపంచ దేశాలు భారత్ వైపు ఒక ఆశాకిరణంలా చూస్తుంటే, ఆ ఘనతను ప్రపంచ వేదికలపై సగర్వంగా నిలబెట్టారు మోదీ.

ఒకవైపు దేశం ఇంతటి స్థిరత్వంతో దూసుకుపోతుంటే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మాత్రం ఈ సానుకూల మార్పులేవీ కనిపించడం లేదు సరికదా, దేశాన్ని అస్థిరపరిచే శక్తులకు ఆయన అభయహస్తం అందిస్తున్నారు. పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ హింసతో, అరాచకత్వంతో రగిలిపోతుంటే.. ఆ దేశ పరిస్థితులు మనకు ఆదర్శం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే నేహా బోరా వంటి కమ్యూనిస్టు నేతలకు, వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకున్న ప్రశాంత్ భూషణ్ లాంటి వారికి రాహుల్ గాంధీ వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన భారత ప్రభుత్వాన్ని కూల్చడానికి విదేశీ శక్తుల కనుసన్నల్లో సాగే ‘రెజిమ్ ఛేంజ్’ కుట్రల గురించి వీరంతా బహిరంగంగా మాట్లాడుతుంటే, రాహుల్ గాంధీ వీరికి మద్దతు పలకడం అత్యంత ప్రమాదకరం. దేశ సరిహద్దుల్లో, అంతర్గతంగా అశాంతిని రేకెత్తించి, బంగ్లాదేశ్ తరహా అలజడులను భారత్‌లోనూ సృష్టించాలనుకునే ఈ దేశద్రోహ శక్తులతో రాహుల్ చేతులు కలపడం ఆయన రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ట.

రాహుల్ గాంధీ నిరంతరం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ విదేశీ గడ్డపై సైతం దేశాన్ని బద్నాం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ నిజానికి రాహుల్ గాంధీకి కావాల్సింది ప్రజాస్వామ్య పరిరక్షణ కాదు, కేవలం అధికార పీఠం, పదవులే. ప్రజల మద్దతుతో వరుసగా ఎన్నికవుతున్న మోదీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడమే లక్ష్యంగా విపక్షాలు నడుచుకుంటున్నాయి.

ఒకవైపు దేశాన్ని 12 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను నిలిపిన నాయకుడు మోదీ. మరోవైపు, దేశ ప్రగతిని అడ్డుకుంటూ, అశాంతిని కోరుకునే శక్తులకు తోడుగా నిలుస్తున్న ప్రతిపక్షం. నేటి భారతావనికి ఏది రక్షణో, ఎవరు భస్మాసుర హస్తాలో ప్రజలు స్పష్టంగా గమనిస్తూనే ఉన్నారు.

Join GenZ Talks WhatsApp Channel

తాజా వార్తలు

Story Slide

Read Full Story →