Wed, Oct 14, 2026  |  07:51:14 PM IST

ట్రంప్ టారిఫ్ బూచిని అడ్డంగా తొక్కేసిన మోదీ దౌత్యం!

ట్రంప్ టారిఫ్ బూచిని అడ్డంగా తొక్కేసిన మోదీ దౌత్యం!
Follow Us :

అమెరికా అంటేనే అగ్రరాజ్యం. ఆ దేశానికి ప్రెసిడెంట్ ట్రంప్ అయితే.. ఇక ఆయన నోటి నుంచి వచ్చేది ఆదేశాలు కాదు, బెదిరింపులు. మాట్లాడితే 100 శాతం టారిఫ్‌లు వేస్తాం, దారికి తెచ్చుకుంటాం అని ప్రపంచ దేశాలపై హుకుం జారీ చేయడం ట్రంప్‌కు అలవాటు. భారతదేశం ఎదుగుదలను అడ్డుకోవాలని, భారత్‌ ఎక్కడ ఆయిల్ కొనాలో.. ఎవరికి అమ్మాలో తామే డిక్టేట్ చేయాలని వాషింగ్టన్ పెద్దలు భావించారు. రష్యా నుంచి తక్కువ ధరకే చమురు కొంటూ దేశాన్ని కాపాడుకుంటున్న భారత్‌పై టారిఫ్ బూచిని చూపించి లొంగదీసుకోవాలని చూశారు. కానీ, అక్కడ ఉన్నది నవభారత రక్షకుడు ప్రధాని నరేంద్ర మోదీ. అమెరికా కుట్రలను, ట్రంప్ ఆర్థిక బెదిరింపులను అడ్డంగా తొక్కేసి.. భారత సార్వభౌమత్వాన్ని ప్రపంచ వేదికపై సగర్వంగా నిలబెట్టారు మోదీ.

ఈమధ్యే అమెరికా కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026’ అనే కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చింది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే మొదటి ఐదు దేశాలపై.. ఏకంగా 100 శాతం వరకు శిక్షాత్మక టారిఫ్‌లు విధించేందుకు ఈ చట్టం ట్రంప్‌కు సర్వాధికారాలు ఇచ్చింది. చైనా, భారత్‌లను టార్గెట్ చేస్తూ తెచ్చిన ఈ చట్టంతో భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని అమెరికా భావించింది. కానీ ప్రధాని మోదీ వ్యూహాత్మక దౌత్యం ముందు అమెరికా బెదిరింపులు ఒక్కసారిగా నీరుగారిపోయాయి. ఇష్టారీతిన మాట్లాడిన ట్రంప్ సర్కారే.. చట్టం అమలు కావడానికి సరిగ్గా రెండు రోజుల ముందు మోదీ దౌత్య వ్యూహానికి మోకరిల్లింది. ఈ చట్టం పరిధిలోని టారిఫ్ నిబంధనలను తాత్కాలికంగా నిలిపివేస్తూ స్వయంగా ప్రెసిడెంట్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేయక తప్పలేదు. భారత్‌కు సుంకాల ముప్పు తప్పింది.

భారత్‌పై టారిఫ్‌లు వేయబోమంటూ సాక్షాత్తూ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఇచ్చిన అధికారిక స్టేట్‌మెంట్.. మోదీ సాధించిన అద్భుత విజయానికి తిరుగులేని నిదర్శనం! “భారతదేశం మాకు అత్యంత కీలకమైన భాగస్వామి.. టారిఫ్‌లు విధించే ముందు భారత్ ఎనర్జీ అవసరాలను మేము కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి” అంటూ రూబియో బహిరంగంగానే ఒప్పుకున్నారు. అంతేకాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన జామ్‌నగర్ రిఫైనరీని సందర్శించేందుకు, భారత పారిశ్రామిక వేత్తలతో చర్చలు జరిపేందుకు మార్కో రూబియో స్వయంగా భారత్‌కు రావడం మోదీ దౌత్య పవర్‌కు అద్దం పడుతోంది.

ప్రపంచ దేశాలను శాసించాలనుకున్న ట్రంప్‌నే తన వ్యూహాలతో దారికి తెచ్చుకున్నారు ప్రధాని మోదీ. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గకుండా.. అటు రష్యా నుంచి చమురు కొంటూ దేశంలో ఇంధన ధరలు పెరగకుండా చూశారు, ఇటు అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కూడా అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఏ దేశం ముందు వంగని.. ఏ శక్తీకీ లొంగని సగర్వ నవభారతానికి ఈ విజయమే నిదర్శనం.

Join GenZ Talks WhatsApp Channel

తాజా వార్తలు

Story Slide

Read Full Story →