ప్రపంచ భౌగోళిక రాజకీయాలు గతంలో ఎన్నడూ లేనంత వేగంగా, అత్యంత సంక్లిష్టంగా మారుతున్నాయి. ఒకవైపు అమెరికాలో నూతన ప్రభుత్వ విధానాలు అంతర్జాతీయ వాణిజ్య సమీకరణాలను మారుస్తుంటే, మరోవైపు ప్రాంతీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇటువంటి అస్థిరమైన అంతర్జాతీయ వాతావరణంలో కూడా భారతదేశాన్ని ఒక తిరుగులేని పవర్‌హౌస్‌గా నిలబెట్టడంలో, దేశ ప్రయోజనాలే పరమావధిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవలంబిస్తున్న సరికొత్త దౌత్య వ్యూహం నేడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పాత దౌత్య సూత్రాలకు స్వస్తి పలికి, వర్తమాన సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటూ మోదీ రచిస్తున్న సరికొత్త గ్లోబల్ ప్లేబుక్ భారతదేశాన్ని ప్రపంచ గమనాన్ని నిర్దేశించే శక్తుల సరసన నిలబెట్టింది.
ఈ మధ్య కాలంలో ప్రపంచ దేశాలను అత్యంత ఆశ్చర్యపరిచిన పరిణామం ఏదైనా ఉందంటే, అది అమెరికా విధించిన కఠినమైన అంతర్జాతీయ టారిఫ్ సవాళ్లను భారత్ ఎదుర్కొన్న తీరు. అమెరికా నుండి ఎదురైన భారీ ఆర్థిక, వాణిజ్య ఒత్తిళ్లను తట్టుకుంటూనే, మోదీ ప్రభుత్వం అత్యంత చారిత్రాత్మకమైన సరికొత్త వాణిజ్య ఒప్పందాన్ని సాధించబోతోంది. భారతీయ వస్తువులపై టారిఫ్‌లను గణనీయంగా తగ్గించడంలో మోదీ చూపిన చొరవ భారత ఎగుమతిదారులకు కొండంత అండగా నిలవడమే కాకుండా, పశ్చిమ దేశాల ఒత్తిళ్లకు భారత్ లొంగబోదనే బలమైన సందేశాన్ని అంతర్జాతీయ సమాజానికి పంపింది.
సరిహద్దుల్లో చైనా విసిరిన సవాళ్లను మోదీ ప్రభుత్వం డీల్ చేసిన తీరు ఆయనలోని వ్యూహాత్మక చతురతకు నిదర్శనం. రక్షణ రంగంలో ఎక్కడా రాజీ పడకుండానే, దౌత్యపరంగా చైనాతో “టాక్టికల్ థా” సాధించడంలో మోదీ విజయం సాధించారు. దీని ఫలితంగానే ఉభయ దేశాల మధ్య వీసాల పునరుద్ధరణ, వాటర్-డేటా షేరింగ్‌తో పాటు ఎంతో పవిత్రమైన కైలాష్-మానససరోవర్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేస్తూనే, ప్రాంతీయ శాంతికి పెద్దపీట వేసేలా మోదీ నడిపిన దౌత్యం ప్రపంచ రక్షణ నిపుణుల ప్రశంసలు అందుకుంటోంది. అదే సమయంలో షాంఘై సహకార సంస్థ-SCO వంటి గ్లోబల్ సమిట్లలో చైనా, రష్యా అధినేతలతో సమానంగా కూర్చుని చర్చలు జరుపుతూనే, దేశ భద్రతా ప్రయోజనాలను మోదీ అత్యున్నత స్థాయిలో కాపాడారు.
కేవలం పెద్ద దేశాలతోనే కాకుండా, పశ్చిమ ఆసియా ప్రాంతంలో వ్యూహాత్మక విస్తరణకు మోదీ శ్రీకారం చుట్టారు. ఒమన్‌తో కుదుర్చుకున్న సరికొత్త సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం -CEPA ఈ ప్రాంతంలో భారత వాణిజ్య సామ్రాజ్యానికి సరికొత్త తలుపులు తెరిచింది. రక్షణ పరంగా చూస్తే, హిందూ మహాసముద్ర ప్రాంతంలో అంతర్జాతీయ వాణిజ్య నౌకలను సముద్ర దొంగల ముఠాల నుండి రక్షించేందుకు మోదీ నాయకత్వంలో నడుస్తున్న ‘ఆపరేషన్ సంకల్ప్’ ద్వారా భారత్ ప్రపంచానికి ఒక నమ్మకమైన నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్‌గా అవతరించింది. గ్లోబల్ సౌత్ దేశాలకు కష్టం వస్తే తక్షణమే స్పందించే మొదటి దేశంగా భారత్‌ను మోదీ నిలిపారు. ఈమధ్య సంభవించిన భారీ ‘డిత్వో తుఫాను’ సమయంలో శ్రీలంకకు తక్షణమే 450 మిలియన్ డాలర్ల భారీ అత్యవసర సహాయాన్ని అందించి, ప్రపంచ వేదికపై మానవత్వానికి మోదీ మారుపేరుగా నిలిచారు.
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం, అమెరికా వాణిజ్య ఆంక్షలు, చైనా సరిహద్దు సవాళ్లు వంటి తీవ్రమైన భౌగోళిక రాజకీయ తుఫానులు నడుస్తున్న ప్రస్తుత తరుణంలో.. వాటన్నింటినీ తట్టుకుంటూ భారతదేశాన్ని ఒక తిరుగులేని గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవలంబిస్తున్న నూతన దౌత్య వ్యూహం నిజంగా అమోఘం. ఒకప్పుడు అంతర్జాతీయ వ్యవహారాల్లో కేవలం ఒక ప్రేక్షక దేశంగా ఉన్న భారతదేశాన్ని, నేడు ప్రపంచ గమనాన్ని మార్చగల ఏకైక శక్తిగా మార్చిన మోదీ, అంతర్జాతీయ వేదికపై ‘ది గ్రేట్ లీడర్’గా అగ్రస్థానంలో నిలిచారు







