Wed, Oct 14, 2026  |  07:51:14 PM IST

రాహుల్ గాంధీకి ప్రజాస్వామ్యం వద్దు.. పదవులే ముద్దు

రాహుల్ గాంధీకి ప్రజాస్వామ్యం వద్దు.. పదవులే ముద్దు
Follow Us :

పక్క దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేసి, రక్తం ఏరులై పారించిన బంగ్లాదేశ్ తిరుగుబాటును భారతదేశానికి ఆదర్శంగా చూపించడం వెనుక ఉన్న ఆంతర్యమేంటి రాహుల్‌గాంధీ? శాంతియుత భారతదేశంలో అశాంతిని రేకెత్తించడమే రాహుల్ లక్ష్యమా? అరాచకత్వాన్ని సృష్టించడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారా? చూస్తుంటే ఇవి అనుమానాలుగా అనిపించడం లేదు. దేశంపై కక్ష గట్టి చేస్తున్న అరాచకవాదంగా కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యం గురించి ఉపన్యాసాలు దంచే నాయకులు, ఇలాంటి ప్రమాదకరమైన ఆలోచనలను బహిరంగంగా ఖండించకపోగా, వాటిని సమర్థించడం వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడుతామంటూ పదే పదే నినాదాలు చేసే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరు అత్యంత ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్య పద్ధతుల కంటే అధికార పీఠమే పరమావధిగా ఆయన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. నేహా బోర వంటి కమ్యూనిస్ట్ శ్రేణులు, వామపక్ష నాయకులు బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక, అరాచక ఉద్యమాలను భారతదేశంలో కూడా ఆదర్శంగా తీసుకోవాలని, అలాంటి పరిస్థితులను ఇక్కడ పునరావృతం చేయాలని పిలుపునిస్తుంటే, దానికి రాహుల్ గాంధీ మద్దతుగా నిలవడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. కేవలం అధికార దాహంతో ఇంతలా దిగజారాలా అంటూ సామాన్య ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు.

ఈమధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు చేపడుతున్న నిరసనలు, ఆందోళనలు కేవలం ప్రజా సమస్యలపై కాకుండా, కేంద్రాన్ని ఎలాగైనా ఇరుకున పెట్టాలనే ఏకైక ఎజెండాతో సాగుతున్నాయి. వీధుల్లోకి వచ్చి ప్రజలను రెచ్చగొట్టడం, వ్యవస్థలను బలహీనపరచడం వంటి చర్యలు దేశ సార్వభౌమత్వానికి గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. పదవి కోసం ఎంతటి ప్రమాదకరమైన శక్తులతోనైనా చేతులు కలపడానికి రాహుల్ గాంధీ వెనుకాడటం లేదనడానికి ఈ పరిణామాలే నిదర్శనం.

రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ పదవే ముద్దు అనే ధోరణితో దేశ భద్రతను పణంగా పెట్టడం క్షమార్హం కాని నేరమని రాజకీయ మేధావులు హెచ్చరిస్తున్నారు. కమ్యూనిస్టు లీడర్ల తీవ్రవాద ఆలోచనలకు, దేశాన్ని అస్థిరపరిచే కుట్రలకు రాహుల్ గాంధీ పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడం దేశ భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరం. “ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం” అనే ముసుగులో జరుగుతున్న ఈ రాజకీయ దిగజారుడుతనాన్ని ప్రజలు గమనిస్తున్నారని, దేశాన్ని అల్లకల్లోలం చేయాలనుకునే శక్తులకు తగిన బుద్ధి చెబుతారని విమర్శకులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు

Join GenZ Talks WhatsApp Channel

తాజా వార్తలు

Story Slide

Read Full Story →