Wed, Oct 14, 2026  |  07:51:14 PM IST
నా వైఫ్ మిస్సింగ్’ మూవీ రివ్యూ

నా వైఫ్ మిస్సింగ్’ మూవీ రివ్యూ

23 Oct 2026|
2.5 / 5
Follow Us :

నా వైఫ్ మిస్సింగ్’ మూవీ రివ్యూ: ఒకప్పుడు ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో యువతను ఆకట్టుకున్న వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ చాలా కాలం తర్వాత మరోసారి జంటగా కనిపించారు. స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 23 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. భార్య కనిపించకుండా పోవడం, భర్త చుట్టూ అనుమానాలు, ఊహించని మలుపులతో సాగిపోయే ఈ కథ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందిస్తుంది? అసలు ఈ సినిమా కథేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

నా వైఫ్ మిస్సింగ్ మూవీ వివరాలు

  • నిర్మాణ సంస్థ: లైట్ హౌస్ సినీ మ్యాజిక్
  • నిర్మాత: శివ కంఠంనేని
  • దర్శకత్వం: స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ
  • సంగీతం: సాయి కార్తీక్
  • సినిమాటోగ్రఫీ: ఎన్.ఎస్. సతీష్ కుమార్
  • ఎడిటింగ్: సాయిబాబు తలారి
  • ఓటీటీ వేదిక: ఆహా

నా వైఫ్ మిస్సింగ్ కథేంటి?

బాలు (వరుణ్ సందేశ్) ఓ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. అతని భార్య స్వప్న (శ్వేతా బసు ప్రసాద్) అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో పోలీసులను ఆశ్రయిస్తాడు. ఈ కేసు విచారణలో భాగంగా వారి వైవాహిక జీవితం, గతంలో జరిగిన కొన్ని కీలక సంఘటనలు వెలుగులోకి వస్తాయి.

పెద్దలు కుదిర్చిన వివాహం ద్వారా బాలు, స్వప్న ఒక్కటవుతారు. పెళ్లికి ముందే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ విషయాన్ని స్వప్న అతనికి స్పష్టంగా చెబుతుంది. అయినప్పటికీ బాలు ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. అయితే పెళ్లయిన తర్వాత స్వప్న తనకు అబాన్ (మోహిత్ పెద్దాడ) అనే వ్యక్తితో ప్రేమ సంబంధం ఉందని, అతనితో వెళ్లిపోవాలనుకుంటున్నానని చెబుతుంది.

ఈ పరిణామాలన్నింటికీ బాలు ఊహించని రీతిలో స్పందిస్తాడు. భార్య నిర్ణయానికి అడ్డుచెప్పకుండా తనదైన ప్రణాళికను సిద్ధం చేసుకుంటాడు. కానీ కొంతకాలానికి స్వప్న అదృశ్యం కావడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఈ కేసులో అనుమానితుడిగా మారిన బాలును పోలీసులు అరెస్ట్ చేస్తారు.

మరోవైపు, స్వప్న తన దగ్గరకు రాలేదని చెప్పే అబాన్.. బాలుకు బెయిల్ రావడంలో సహాయపడతాడు. అసలు స్వప్న ఎక్కడికి వెళ్లింది? ఆమె అదృశ్యం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? భార్య విషయంలో బాలు ఇంత ప్రశాంతంగా ఎందుకు వ్యవహరిస్తున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ‘నా వైఫ్ మిస్సింగ్’ సినిమాను ఆహాలో చూడాల్సిందే.

Join GenZ Talks WhatsApp Channel

తాజా వార్తలు

Story Slide

Read Full Story →