Wed, Oct 14, 2026  |  07:51:14 PM IST

డ్రామా ఆఫ్ ది డెకేడ్

డ్రామా ఆఫ్ ది డెకేడ్
Follow Us :
ఢిల్లీ లూటియన్స్ జోన్‌లోని ఆ బంగ్లా ఆ రాత్రి ఒక విచిత్రమైన పొలిటికల్ థియేటర్‌కు వేదికైంది. అచ్చం పాత పార్లమెంట్ భవనాన్ని పోలిన సెట్టింగ్. అక్కడ అసలైన ప్రజాస్వామ్య విలువల కంటే, ఒకే ఒక్క వ్యక్తికి “ప్రధాన మంత్రి” హోదాను రుచి చూపించాలనే తపనే ఎక్కువగా కనిపించింది. 
ఎన్నికల బరిలో వరసగా ఓటములు చవిచూస్తూ, అసలైన పార్లమెంటులో పీఎం కుర్చీని అందుకోలేకపోయిన తన కుమారుడి కోసం ఆ తల్లి చేసిన వ్యూహం అది. “ఎలాగూ నిజంగా గెలవలేవు.. కనీసం ఇక్కడైనా నీ ముచ్చట తీర్చుకో” అన్నట్టుగా సాగింది ఆ ప్లాన్. 
సీన్ కట్ చేస్తే.. వేదికపై రాహుల్ గాంధీ వచ్చి కూర్చున్నారు. చుట్టూ కూటమిలోని కొందరు నేతలు కల్పిత మినిస్టర్లుగా, సభాపతులుగా బిల్డప్ ఇచ్చారు. దేశంలోని అసలైన సమస్యలపై చర్చలు లేవు, ప్రజా సంక్షేమ ప్రస్తావనలు లేవు. ఆ ‘ఫేక్ పార్లమెంట్’ ఏకైక అజెండా ఏంటంటే.. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఎన్నికల సంఘంపై నోరు పారేసుకోవడం! 
ఒకరి తర్వాత ఒకరు లేచి, ప్రధాని మోదీని తిట్టడమే లక్ష్యంగా ప్రసంగాలు దంచికొట్టారు. ఆ మాటలకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ముఖాల్లో ఏదో సాధించామనే తృప్తి, చిరునవ్వులు. నిజమైన పార్లమెంటులో మోదీ ముందర నిలబడి వాదించే సత్తా లేక, ఇలా ఒక కృత్రిమ సభను సృష్టించుకుని, అందులో తన వాళ్లతోనే మోదీని తిట్టించుకుని ఆనందపడటం చూసి రాజకీయ విశ్లేషకులు ముక్కున వేలేసుకున్నారు. 
ఈ తతంగానికి సంబంధించిన దృశ్యాలు బయటకు రాగానే సోషల్ మీడియాలో ట్రోల్స్ వరదలా దూసుకొచ్చాయి. “పిల్లలు ఆడుకునే బొమ్మల సభలా ఉంది”, “అధికారం దక్కని ఆక్రోశం ఇలా వెళ్లగక్కుతున్నారు” అంటూ నెటిజన్లు ఏకిపారేశారు. 
మరోవైపు ఈ డ్రామాపై అధికార బీజేపీ అస్సలు తగ్గలేదు. హైదరాబాద్ పాదయాత్రలో హోం మంత్రి అమిత్ షా గట్టిగా గర్జించారు. “రాహుల్ గాంధీ తన జీవితకాలం అంతా ఇలాంటి మాక్ పార్లమెంట్‌లోనే ప్రధానిగా గడపాలి.. నిజమైన పార్లమెంట్‌లో ఆయన వంతు ఎప్పటికీ రాదు!” అంటూ సింగిల్ డైలాగ్‌తో ఆ డ్రామాను తుత్తునియలు చేశారు. 
అధికారం కోసం పాకులాడే తత్వానికి, చేతకానితనానికి ఈ “ఫేక్ పార్లమెంట్” ఒక సజీవ సాక్ష్యంగా నిలిచిపోతుందంటూ పొలిటికల్ సర్కిల్స్ లో విమర్శలు వెల్లువెత్తాయి.
Join GenZ Talks WhatsApp Channel

తాజా వార్తలు

Story Slide

Read Full Story →