Wed, Oct 14, 2026  |  07:51:14 PM IST

రాష్ట్రం ఎటు వెళ్తోంది చంద్రబాబు?

రాష్ట్రం ఎటు వెళ్తోంది చంద్రబాబు?
Follow Us :
ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు ఎటు వైపు వెళ్తున్నాయి? క్లాస్ రూమ్ దాకా దారుణాలు సాగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? విచ్చలవిడిగా మద్యం షాపులకు టెండర్లు ఇచ్చి, ప్రతి గల్లీలోనూ మద్యం దుకాణాలను అందుబాటులోకి తెచ్చి, యువతను గంజాయి మత్తులోకి నెట్టేస్తున్న ఈ వ్యవస్థను చూస్తుంటే అసలు ఇక్కడ ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోంది. ఈ రోజు క్లాస్ రూమ్ దాకా వచ్చిన ఈ దారుణం, రేపు సామాన్య ప్రజల ఇళ్ల మీదకు రాదని గ్యారెంటీ ఏంటి? ఎవరో ఒకరిద్దరిని అరెస్ట్ చేసి, మేమేదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నామంటూ, ప్రజలను కాపాడుతున్నామంటూ ప్రగల్భాలు పలకడం తక్షణమే ఆపాలి. కేవలం అరెస్టుల వల్ల వ్యవస్థ మారదు, మూలాల్లో ఉన్న మత్తు నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో పాతేయాలి.
రాప్తాడులో ఇంతటి ఘోరం జరిగితే హోం శాఖ మంత్రి, విద్యా శాఖ మంత్రి అసలు ఏం చేస్తున్నట్టు? శాంతిభద్రతలను గాలికి వదిలేసి, ప్రచార ఆర్భాటాల్లో మునిగితేలుతున్న మీ చేతకానితనానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. విద్యాసంస్థల్లో విద్యార్థులకు రక్షణ కల్పించలేని విద్యాశాఖ మంత్రికి, రాష్ట్రంలో గంజాయి, మద్యం మాఫియాల ఆటకట్టించలేక చేతులెత్తేసిన హోం శాఖ మంత్రికి ఆ పదవుల్లో కొనసాగే అర్హత ఉందా? మీ శాఖల వైఫల్యానికి రాప్తాడు ఘటనపై పూర్తి బాధ్యత వహిస్తూ తక్షణమే సమాధానం చెప్పాలి. దారుణాలు జరిగాక ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో మీ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది.
దారుణాలు జరిగాక కంటితుడుపు చర్యలు చేపట్టడం కాదు, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. విద్యా సంస్థలకు, నివాస ప్రాంతాలకు దూరంగా, మద్యం దుకాణాలన్నింటినీ ఊరి చివర పెట్టేలా ప్రభుత్వం అర్జంట్‌గా జీవో పాస్ చేయాలి. రాప్తాడులో జరిగిన ఘోర కలికి విద్యా శాఖ, హోమ్ శాఖలే పూర్తి బాధ్యత వహించాలి. యువత మద్యం, గంజాయి మత్తులో జోగుతూ భవిష్యత్తును పాడు చేసుకుంటుంటే చట్టసభల్లో కూర్చున్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? 
కేవలం ఆదాయం కోసం, రాజకీయాల కోసం యువత భవితవ్యాన్ని పణంగా పెడతారా? ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరవాలి. ప్రచార ఆర్భాటాలు పక్కన పెట్టి, క్షేత్రస్థాయిలో కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఈ మత్తు భూతం రేపు ప్రతి ఒక్కరి ఇంటి తలుపు తట్టడం ఖాయం!
Join GenZ Talks WhatsApp Channel

తాజా వార్తలు

Story Slide

Read Full Story →