Wed, Oct 14, 2026  |  07:51:14 PM IST

ఆమే ఆంబులెన్స్‌గా మారింది

ఆమే ఆంబులెన్స్‌గా మారింది
Follow Us :
అమరావతి గాల్లో హైటెక్ జిలుగులు మెరుస్తున్నాయి. కార్పొరేట్ బోర్డులపై ప్రగతి పరుగుల కబుర్లు హోరెత్తుతున్నాయి. గాల్లో హెలికాప్టర్లు, సీఎమ్ ఛాంబర్లలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, ప్రతి రోజూ అంబరాన్ని తాకే మాటల గారడీ… ఇదీ పాలన తాలూకు పైపై మెరుగులు! కానీ, ఆ జిగేల్ మనే కాంతుల వెనుక, ఈ డిజిటల్ డ్రామాల ఆవలి వైపు చీకటి కోణం ఒకటి గుండెల్ని పిండేస్తోంది.
అది విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం… పల్లపు దుంగాడ గిరిజన గ్రామం! అక్కడ హైటెక్ రోడ్లు లేవు, మెరుగైన వైద్యం లేదు. కనీసం నడవడానికి ఒక బాట కూడా లేదు. పన్నెండేళ్ల పసిబిడ్డ ప్రాణాలు పోతుంటే, ఆదుకోవడానికి ఏ ప్రభుత్వ యంత్రంగమూ కదలలేదు. 108 అంబులెన్స్ రాలేదు. చివరికి ఆ కన్నతల్లే తన బిడ్డను భుజాన వేసుకుని, కొండలు గుట్టలు దాటుకుంటూ 7 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. 
“ప్రపంచంతో పోటీ పడుతున్నాం… అమరావతిని సింగపూర్ చేస్తున్నాం” అంటూ నిత్యం టీవీలెక్కి ఊదరకొట్టే చంద్రబాబు పాలనకు ఇదిగో, ఈ 7 కిలోమీటర్ల నడకనే అద్దం పడుతున్న నిజమైన రియాలిటీ చెక్!
కోట్లు ఖర్చు పెట్టి గ్రామాల అభివృద్ధే లక్ష్యమంటారు. కానీ కోట్ల రూపాయల నిధులు మంజూరైనా, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఆ గిరిజన ప్రాంతానికి రోడ్డు మాత్రం నోచుకోలేదు. బాధ్యత లేని పాలనలో, అధికారుల ఉదాసీనతలో బతికేయడానికి గిరిజనులేమైనా పనికిరాని వస్తువులా? అమరావతి భవనాలపై ఉన్న శ్రద్ధ, ఆ అడవి బిడ్డల ప్రాణాల మీద ఎందుకు లేదు?
సూపర్‌ఫాస్ట్ పాలన అందిస్తున్నామని గొప్పలు చెప్పుకునే పెద్దమనుషులకు, ఒక తల్లి తన బిడ్డను భుజాన మోస్తూ పడిన ఆవేదన కనిపించలేదా? ఆ గిరిజనుల కన్నీళ్లు ఈ ప్రభుత్వ కళ్లకు తగలదా?
మాటల గారడీలతో ప్రజలను మభ్యపెట్టడం ఆపి, ఇప్పటికైనా గ్రౌండ్ రియాలిటీని చూడండి బాబు! హైటెక్ కలల నుంచి బయటకొచ్చి, అట్టడుగున మగ్గుతున్న ఆ గూడేలకు రోడ్లు, వైద్యం అందేలా చేయకపోతే… ప్రజలే ఈ పాలనను ఓ రేంజ్‌లో నిలదీసే రోజు ఎంతో దూరంలో లేదు!
Join GenZ Talks WhatsApp Channel

తాజా వార్తలు

Story Slide

Read Full Story →