Wed, Oct 14, 2026  |  07:51:14 PM IST

బంగారం ధర ఆకాశంలో.. అయినా ఎగబడి కొంటున్న ‘జెన్‌జీ’

బంగారం ధర ఆకాశంలో.. అయినా ఎగబడి కొంటున్న ‘జెన్‌జీ’
Follow Us :
బంగారాన్ని తెగ కొనేస్తున్నారు. రేటు ఇంత భయంకరంగా ఉంటే ఇప్పుడెవర్రా బాబూ కొనేది అనుకుంటున్నారా. ద ఆన్సర్ ఈజ్.. జెన్‌జీ. ఏంటి జెన్‌జీ అంత బంగారం కొనేస్తోందా… ఏదీ, ఎక్కడా కనిపించడం లేదేం అనుకుంటున్నారేమో. నిజమే.. కనిపించడం లేదు. వాళ్లు డైరెక్టుగా ఫిజికల్ గోల్డ్‌ని కొనడం లేదు. ఈ జెన్‌జీకి తెలివి ఎక్కువ కదా.. నాలుగడుగులు ముందే ఆలోచిస్తారు కదా.. ఫిజికల్ గోల్డ్‌ కాకుండా డిజిటల్ గోల్డ్ కొనేస్తున్నారు.
షాప్‌కి వెళ్లడం, గ్రామ్ ఎంత, తులం ఎంత, కాసు ఎంత అని ఆరా తీయడం లేదు. వ్యాట్, జీఎస్టీ, తరుగుదల, మేకింగ్ ఛార్జెస్ గట్రా జంఝాటం వాళ్లు పడడం లేదు. పుల్‌గా.. ఆన్‌లైన్‌లోనే డిజిటల్ గోల్డ్ కొనేస్తున్నారు. చక్కగా, సింపుల్‌గా ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు, పోకెట్‌లో వేసుకుంటున్నారు. దట్ జీ.. జెన్‌జీ. 
ఓ డేటా ప్రకారం.. ఈ డిజిటల్ గోల్డ్‌ను ఈ ఇయర్ వరల్డ్‌వైడ్‌గా 120 మిలియన్ పీపుల్.. అంటే 12 కోట్ల మంది కొన్నారు. అందులో 40 పర్సెంట్.. జెన్‌జీలే ఉన్నారు. పేరుమోసిన ఇన్వెస్టర్లు, తలపండిన ఇన్వెస్టర్లతో పోటీగా ఈ డిజిటల్‌ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తూ 40 పర్సెంట్ వాటా వాళ్లే ఇన్వెస్ట్ చేశారంటే మామూలు విషయం కాదు. ఈ నెంబర్ ఫ్యూచర్‌లో ఇంకాస్త పెరుగుతుంది. అందుకే, ఎస్పెషియల్లీ.. ఈ జెన్‌జీ కోసమే డిజిటల్ గోల్డ్ అమ్మే కంపెనీలు కొత్త కొత్త స్కీమ్‌లు తెచ్చేందుకు ట్రై చేస్తున్నాయి.
మరొక్క నెలా రెండు నెలల్లో డిజిటల్ గోల్డ్ స్కీమ్స్‌లో అదిరిపోయే ఆఫర్లు కళ్ల ముందుకు రాబోతున్నాయి. మనం చూస్తుంటాం.. గోల్డ్ షాపుల్లో గోల్డ్ స్కీమ్‌ల గురించి. 11 నెలలు కట్టండి, 12వ నెల వాయిదా తామే కట్టేసి, మేకింగ్ ఛార్జీలు లేకుండా గోల్డ్ ఇస్తాం.. అంటుంటాయి. అలాంటి స్కీమ్స్ కాదు ఈ డిజిటల్ గోల్డ్ కంపెనీస్ పెట్టేవి.. అంతకుమించి స్కీమ్స్ రాబోతున్నాయి. పర్టిక్యులర్‌గా జెన్‌జీని దృష్టిలో పెట్టుకునే ఈ స్కీమ్స్ తీసుకొస్తున్నాయ్ కంపెనీలు. ఎంతైనా.. జెన్‌జీలా మజాకా. 
Join GenZ Talks WhatsApp Channel

తాజా వార్తలు

Story Slide

Read Full Story →