Wed, Oct 14, 2026  |  07:51:14 PM IST

భారత సైన్యం పరువు తీస్తున్న కాంగ్రెస్ డీప్‌ఫేక్ కుట్ర

భారత సైన్యం పరువు తీస్తున్న కాంగ్రెస్ డీప్‌ఫేక్ కుట్ర
Follow Us :

రాజకీయ లబ్ధి కోసం దేశ భద్రతను, భారత సైన్యం ఆత్మగౌరవాన్ని పణంగా పెడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక నీచమైన కుట్రను భారత సైన్యం నడిరోడ్డుపై నిలబెట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రతినిధి రీతూ చౌదరి సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసిన రెండు వీడియోలు పచ్చి అబద్ధాలని, అవి దేశంలో అలజడి సృష్టించడానికి పన్నిన కుట్రలని ఆర్మీ ఆధారాలతో సహా గుట్టురట్టు చేసింది.

కాంగ్రెస్ నేతలు ఏకంగా ఆర్మీ సీనియర్ ఆఫీసర్ లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కాలియాకు చెందిన ఒక పాత వీడియోను తీసుకుని, AI టెక్నాలజీతో వాయిస్ క్లోనింగ్, లిప్-సింక్ మార్చేసి ఒక ఘోరమైన డీప్‌ఫేక్ వీడియోను సృష్టించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని అసఫిలా, లాంగ్‌జౌ, తక్సింగ్ ప్రాంతాలను చైనా ఆక్రమించేసిందని, సరిహద్దుల్లోని భారత సైనికులకు కనీసం తిండి, నిత్యావసరాలు కూడా అందడం లేదని ఆ ఆర్మీ ఆఫీసరే స్వయంగా ఒప్పుకుంటున్నట్లు ఆ డీప్‌ఫేక్ వీడియోలో భ్రమ కల్పించారు.
కానీ అసలు నిజం ఏంటంటే, అది అక్టోబర్ 2023లో జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారాలో ఉగ్రవాద చొరబాట్లపై ఆ అధికారి ఇచ్చిన ప్రెస్ బ్రిఫింగ్! దాన్ని కాస్తా చైనా చొరబాటుగా మార్చేసి, దేశ సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ ప్రచారం చేయడం అత్యంత దారుణం.

అంతటితో ఆగకుండా, సిక్కింలోని నాథూ లా పాస్ వద్ద భారత్-చైనా దేశాల మధ్య అధికారికంగా జరిగే సరిహద్దు వ్యాపారానికి సంబంధించిన సివిల్ కమర్షియల్ వాహనాల రాకపోకలను చూపిస్తూ… “చైనా సైన్యం భారత్‌లోకి చొరబడుతోంది, గోడీ మీడియా దీన్ని చూపించదు” అంటూ కాంగ్రెస్ ప్రతినిధి ప్రజలను తప్పుదోవ పట్టించేలా మరో వీడియో వదిలారు. అధీకృత సరిహద్దు వాణిజ్యాన్ని దేశంపై దాడిగా చిత్రీకరించడం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట.

అందుకే, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు దీనిపై గట్టిగా రిప్లై ఇచ్చారు. “ఇది శత్రుదేశాల కంటే ఘోరమైన దేశద్రోహం” అంటూ ఈ ఫేక్ న్యూస్ వ్యవహారంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా మండిపడ్డారు. “భారత సైన్యం ప్రతిష్టను దిగజార్చడానికి, దేశంలో భయాందోళనలు సృష్టించడానికి కాంగ్రెస్ పార్టీ శత్రుదేశాల తరఫున ఒక నీచమైన క్యాంపెయిన్ నడుపుతోంది. ఇది ముమ్మాటికీ దేశద్రోహ చర్య. దీనికి కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి” అని ఆయన డిమాండ్ చేశారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, తప్పులేదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది, కానీ ఆ నెపంతో దేశ రక్షణ వ్యవస్థలపై అబద్ధాలు ప్రచారం చేయకూడదు. ఈ మాత్రం కామన్ సెన్స్ రాహుల్ గాంధీకి లేదా? అయినా.. సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగడం ఏంటి? రక్తం ధారపోసి సరిహద్దులను కాపాడుతున్న సైనికుల సరఫరాలపైన, వారి నిజాయితీపైన ఇటువంటి నీచమైన నిందలు వేయడం క్షమించరాని నేరం.

Join GenZ Talks WhatsApp Channel

తాజా వార్తలు

Story Slide

Read Full Story →