Wed, Oct 14, 2026  |  07:51:14 PM IST

విజయసాయి రెడ్డి పార్టీ పేరు ‘YSR AP’

విజయసాయి రెడ్డి పార్టీ పేరు ‘YSR AP’
Follow Us :
ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఏ ట్విస్ట్ వస్తుందో ఊహించడం ఎవరి తరమూ కావట్లేదిప్పుడు. నిన్నటివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మకస్తుడిగా, వైఎస్ జగన్‌కు కుడిభుజంగా వ్యవహరించిన మాజీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి తనదారి తాను వెతుక్కున్నారు. పార్టీలో జరిగిన కొన్ని పరిణామాల వల్ల తీవ్ర అవమానానికి గురై, వైసీపీకి గుడ్‌బై చెప్పేసిన సాయిరెడ్డి.. ఇప్పుడు సొంతంగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన పెట్టబోయే కొత్త పార్టీ పేరు ‘YSR AP’ కానుందనే గాసిప్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
రాజకీయ విశ్లేషకులు, గాసిప్ రాయుళ్ల గుసగుసల ప్రకారం.. విజయసాయి రెడ్డి వైసీపీని వీడినా, వైఎస్ రాజశేఖర రెడ్డి పట్ల ఉన్న అభిమానాన్ని మాత్రం వదులుకోలేదు. జగన్‌పై ఉన్న కోపంతో వైసీపీ క్యాడర్‌ను, వైఎస్సార్ అభిమానులను తన వైపు తిప్పుకోవడానికి ఆయన ఈ ‘YSR AP’ అనే పేరును లైన్‌లోకి తెచ్చినట్లు ప్రచారం సాగుతోంది. వైఎస్సార్ పేరుతో ఉన్న ఓటు బ్యాంకుని చీల్చడమే లక్ష్యంగా ఈ మాస్టర్ ప్లాన్ వేశారని పొలిటికల్ ఇండస్ట్రీ టాక్. గతంలో ‘భారత్ జన వికాస్’ వంటి రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చినా, తాజాగా వినిపిస్తున్న ‘YSR AP’ అనే పేరే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఈ పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌కు క్లైమాక్స్ డేట్ కూడా ఫిక్స్ అయింది. విజయసాయి రెడ్డి నవంబర్ 11న ఉదయం 11 గంటలకు తన కొత్త పార్టీ పేరును, జెండాను అధికారికంగా ప్రకటించబోతున్నారు. అప్పటివరకు ఈ ‘YSR AP’ పేరు చుట్టూ నడిచే హైప్ ఇలాగే కొనసాగేలా ఉంది. అయితే ఈ పార్టీకి తాను సీఎం అభ్యర్థిని కాదని, కేవలం ‘మెంటార్’గా ఉంటూ యువతకు, అన్ని వర్గాలకు సమన్యాయం చేసేలా నడిపిస్తానని ఆయన చెప్పడం వెనుక కూడా పెద్ద వ్యూహమే ఉందంటున్నారు.
ప్రస్తుతం ఏపీ రాజకీయాన్ని శాసిస్తున్న రెండు పెద్ద శక్తులకు ప్రత్యామ్నాయంగా ఈ పార్టీ ఉండబోతోందని టాక్. చంద్రబాబు, జగన్ కుటుంబాల ఆధిపత్యాన్ని విచ్ఛిన్నం చేయడమే విజయసాయి రెడ్డి అసలు ప్లాన్ అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఏదేమైనా, సాయిరెడ్డి మైండ్‌లో ఉన్న అసలు పేరు ‘YSR AP’ అవునా కాదా, ఆయన వేస్తున్న అడుగులు ఏపీ రాజకీయాలను ఏ తీరానికి చేరుస్తాయనేది నవంబర్ 11న తేలిపోనుంది.
Join GenZ Talks WhatsApp Channel

తాజా వార్తలు

Story Slide

Read Full Story →