Wed, Oct 14, 2026  |  07:51:14 PM IST

దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు జగన్ ప్రజాస్వామ్య నీతులు!

దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు జగన్ ప్రజాస్వామ్య నీతులు!
Follow Us :
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంతకంటే హాస్యాస్పదమైన, విడ్డూరమైన దృశ్యం మరొకటి ఉండదు. నిన్నమొన్నటి వరకు అధికార మదంతో, ఫ్యాక్షన్ నీడల్లో సాగిన ‘రౌడీ రాజకీయం’ ఈరోజు అకస్మాత్తుగా ప్రజాస్వామ్య సూత్రాలు మాట్లాడుతుంటే.. నిజంగానే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉంది. 
రాజా రెడ్డి కాలం నాటి ఫ్యాక్షన్ రాజకీయాల నుండి నేటి తరం వరకు సాగిన ఆధిపత్య, దౌర్జన్య రాజకీయ చరిత్రను రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరువలేరు. అలాంటి చరిత్ర కలిగిన నాయకుడు ఈరోజు నిస్సిగ్గుగా “నేను ఓటు వేయను, మీరు వేయద్దు” అంటూ పిలుపునివ్వడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే.
ఇప్పుడు వ్యవస్థలపై నమ్మకం లేదంటూ ఓటింగ్ బహిష్కరణల గురించి మాట్లాడే వైఎస్ జగన్‌కి, రాబోయే 2029 ఎన్నికల్లో కూడా ఇదే మాట మీద నిలబడే దమ్ము, ధైర్యం ఉన్నాయా? నాడు అధికారం చేతిలో ఉన్నప్పుడు అడ్డూఅదుపూ లేకుండా సాగించిన అరాచకాలే నేడు శాపాలుగా మారుతున్నాయి. నిన్నటివరకు నీడలా ఉంటూ, అడుగులకు మడుగులొత్తిన సొంత అనుచరులు, నమ్మిన బంటులే ఇప్పుడు ఒక్కొక్కరుగా తిరగబడుతున్నారు. జగన్ మార్క్ రాజకీయాల వెనుక ఉన్న అసలు రంగును బయటపెడుతూ… వారంతా ఈరోజు న్యాయస్థానాల ముందు అప్రూవర్లుగా మారుతుండటం నీచ రాజకీయానికి పరాకాష్ట.
గత ఐదేళ్ల అనాగరిక పాలనను, అహంకారాన్ని అసహ్యించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొన్నటి ఎన్నికల్లో చెంపదెబ్బ కొడుతూ కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. ఇంతటి ఘోర పరాజయం ఎదురైనా, ప్రజలు చీదరించుకున్నా ఇంకా బుద్ధి రాలేదనేది జగన్ తాజా వ్యాఖ్యలను చూస్తే స్పష్టమవుతోంది. కనీస నైతికతను కోల్పోయి, ఏ ధీమాతో, ఏ మొహంతో “2029 లో మేమే అధికారంలోకి వచ్చేస్తాం” అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు? ప్రజా తీర్పును గౌరవించడం చేతకాని అహంకారానికి ఇది నిదర్శనం.
ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోయినా, ఓటు వేసి గెలిపించిన ఆ కొద్దిమంది ప్రజల కోసమైనా చట్టసభకు వెళ్లాలనే కనీస బాధ్యత జగన్ కు లేదు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో నిలబడి, గళమెత్తి మాట్లాడే ధైర్యం, చేవ లేక సభను బహిష్కరిస్తూ పారిపోతున్నారు. ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీకి వెళ్లేందుకే భయపడే వ్యక్తి… బయటకొచ్చి ప్రజాస్వామ్య విలువల గురించి, వ్యవస్థల గురించి సుద్దులు చెబుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. రౌడీయిజం, ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్‌తో రాజకీయాలు నడిపి, ఇప్పుడు నీతులు మాట్లాడటం జగన్‌కే చెల్లింది
Join GenZ Talks WhatsApp Channel

తాజా వార్తలు

Story Slide

Read Full Story →