Wed, Oct 14, 2026  |  07:51:14 PM IST

తప్పు రేవంత్ సర్కారుది.. త్యాగం రైతాంగానిదా?

తప్పు రేవంత్ సర్కారుది.. త్యాగం రైతాంగానిదా?
Follow Us :

తెలంగాణలో యాసంగి సాగు ముంగిట నిలిచిన రైతాంగానికి అండగా నిలవాల్సిన ప్రజా ప్రభుత్వం, వింత నిబంధనలతో ఉరితాడు బిగిస్తోందా? అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న “వరి విత్తనాల కొనుగోలు – సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్” వ్యవహారంపై రాష్ట్రంలోని Gen-Z నిప్పులు చెరుగుతోంది. “కరెంట్ కోతలున్నా, సాగునీరు అందక పంట ఎండిపోయినా ప్రభుత్వానికి గానీ, డీలర్లకు గానీ ఎలాంటి సంబంధం లేదు.. అంతా నా ఇష్టపూర్వక రిస్క్” అంటూ రైతుల నుంచి సంతకాలు సేకరించడంపై డిజిటల్ వేదికలు అగ్నిగోళాలుగా మారుతున్నాయి.

ఒకవైపు వ్యవసాయ శాఖ అధికారులు అలాంటి అధికారిక ఆదేశాలు ఇవ్వలేదని బుకాయిస్తున్నా, క్షేత్రస్థాయిలో విత్తన డీలర్లు మాత్రం డిక్లరేషన్ ఫామ్ ఇస్తేనే వరి విత్తనాలు ఇస్తామని భీష్మించుకు కూర్చోవడం వెనుక అసలు కుట్ర ఎవరిది? అని జెన్-జీ యువత నిలదీస్తోంది.

ఓట్లు వేసి గెలిపిస్తే.. విపత్తు సమయాల్లో రైతులను ఆదుకోవాల్సిన రేవంత్ సర్కార్, ఇలా బాధ్యతల నుంచి బేషరతుగా తప్పుకుంటూ రైతులపైనే నెపం నెట్టడం ఏ రకమైన న్యాయం? భవిష్యత్తులో పంట నష్టపోతే రైతులు పరిహారం డిమాండ్ చేయకుండా ముందే నోళ్లు నొక్కేందుకే ఈ కుతంత్రమా? అని జెన్‌జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఎక్స్, వాట్సాప్ గ్రూపులలో ఈ డిక్లరేషన్ ఫామ్‌ల ఫొటోలను షేర్ చేస్తూ యువత ప్రభుత్వ అసమర్థతను కడిగిపారేస్తోంది. పదేళ్ల తర్వాత మళ్లీ కరెంట్ సంక్షోభాన్ని, సాగునీటి కరువును తెచ్చిందే కాకుండా, ఇప్పుడు వరి సాగుపై కత్తి దూయడంపై యువత సోషల్ మీడియాలో ట్రోల్స్‌తో విరుచుకుపడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టును సరిగ్గా నిర్వహించకుండా, మేడిగడ్డ రిపేర్లను గాలికొదిలేసి వందల టీఎంసీల నీటిని వృథాగా పోనిచ్చిన సర్కార్, ఇప్పుడు “చుక్క నీరు ఇవ్వలేం.. కరెంట్ గ్యారెంటీ లేదు” అని చేతులెత్తేయడం పాలకుల చేతకానితనానికి పరాకాష్ట అని యువత బహిరంగంగానే విమర్శిస్తోంది.

‘ప్రజా పాలన’, ‘రైతు రాజ్యం’ అంటూ ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ సర్కార్, వరంగల్ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను పక్కనబెట్టి ఇప్పుడు కక్షపూరిత ఆంక్షలతో అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తోందని విపక్షాలతో పాటు చదువుకున్న యువత కూడా ముక్తకంఠంతో గొంతు విప్పుతోంది.

“పంట పండితే మీ ప్రచారాలకు వాడుకుంటారు.. అదే పంట ఎండితే మా కర్మ అని రాసివ్వాలా? ఇదా మీ రైతు క్షేమం?” అంటూ జెన్-జీ వేస్తున్న పవర్ ఫుల్ ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సర్కార్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Join GenZ Talks WhatsApp Channel

తాజా వార్తలు

Story Slide

Read Full Story →